SouKhyaalaku nilayamou - సౌఖ్యాలకు నిలయమౌ

We do not have the Audio (MP3) of this song available on this website. If you have the audio, please send it to us by uploading it here. Thanks!

సౌఖ్యాలకు నిలయమౌ స్వర్గ సీమ మనకేలా
వాత్సల్యము పంచి ఇచ్చు మాతృభూమి ఉండగా

దేవతలీ దేశాన దేహ ధారులౌదురట
జప తప సాధనలు చేసి జన్మ రహితులౌదురట
మరల మరల మాధవుడే ఇటకు వచ్చి పోవునంట
మంచి వారి బ్రోచి దుర్మతులను ద్రుంచునట

అచ్చరల వియచ్చరల సొబగులు మాకేలా
తుంబురాది గంధర్వుల గానాలవి యేలా
కన్నతల్లి కన్నీరీ కరములతో తుడిచెదము
హృత్తంత్రులు మీటి ఆమె ఉల్లము రంజిలజేతము

చిర యశో లలాముడూ శ్రీ రాముడు మనవాడే
సుర గంగను భువి కొసగిన భగీరధుడు మనవాడే
ఆత్మాహుతి నొనరించిన అమరవీరులెందరో
ఆదర్శముగా నిలిచిరి ఆకసమున తారలైరి

souKhyaalaku nilayamou svarga sIma manakElaa
vaatsalyamu pamchi ichchu maatRbhUmi umDagaa

dEvatalI dESaana dEha dhaarulouduraTa
japa tapa saadhanalu cEsi janma rahitulouduraTa
marala marala maadhavuDE iTaku vachchi pOvunamTa
mamci vaari brOchi durmatulanu drumchunaTa

accarala viyaccarala sobagulu maakElaa
tumburaadi gamdharvula gaanaalavi yElaa
kannatalli kannIrI karamulatO tuDicedamu
hRttamtrulu mITi aame ullamu ramjilajEtamu

cira yaSO lalaamuDU SrI raamuDu manavaaDE
sura gamganu bhuvi kosagina bhagIradhuDu manavaaDE
aatmaahuti nonarimchina amaravIrulemdarO
aadarSamugaa niliciri aakasamuna taaralairi

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
  • Lines and paragraphs break automatically.

More information about formatting options