ఐక్యమత సాధకులారా లేవండోయ్, ఇక లేవండోయ్
సమైక్యతా సౌధానికి పునాది శిలలై వెలుగొందండోయ్
దేశానికి అవమానముగూర్చే దీనత్వానికి దోసిలియొగ్గక
మరచిపోయిన మగతనమ్మును మింటికెగయ మెరిపించండోయ్
స్వార్ధం, దైన్యం, సంకుచితత్వ, సమతా రహితం, క్షుద్ర భావనం
సమాజ జీవిత శ్రేయస్సునకై సంకెలలవి తెగ ద్రెంచండోయ్
కూటికి గుడ్డకు అల్లాడె నీ కూర్మి సోదరుల సంక్షేమానికి
జీవిత తంత్రుల రాగము మీటగ కరగి కరుణతో ప్రవహించండోయ్
సస్యశ్యామలా రత్నగర్భయని పూజలు పొందిన మాతృదేవి
దివ్యాలయమును భగ్నమొనర్చే రాక్షసమూకల చెండాడండోయ్
తరతరాలుగా విశ్వ శాంతికై ధరణిని వెలిగిన పౌరుషశాలికి
ఆత్మ విస్మృతే సర్వ నాశనం హుంకరించి ఇక మేల్కోండోయ్
aikyamata saadhakulaaraa lEvamDOy, ika lEvamDOy
samaikyataa soudhaaniki punaadi Silalai velugomdamDOy
dESaaniki avamaanamugUrchE dInatvaaniki dOsiliyoggaka
marachipOyina magatanammunu mimTikegaya meripimchamDOy
svaardham, dainyam, samkuchitatva, samataa rahitam, kshudra bhaavanam
samaaja jIvita SrEyassunakai samkelalavi tega dremchamDOy
kUTiki guDDaku allaaDe nI kUrmi sOdarula samkshEmaaniki
jIvita tamtrula raagamu mITaga karagi karuNatO pravahimchamDOy
sasyaSyaamalaa ratnagarbhayani pUjalu pomdina maatRdEvi
divyaalayamunu bhagnamonarchE raakshasamUkala chemDaaDamDOy
tarataraalugaa ViSva Saamtikai dharaNini veligina pourushaSaaliki
aatma vismRtE sarva naaSanam humkarimchi ika mElkOmDOy
Post new comment