భారతి భగవతి నా తల్లీ
నీ భాగ్యమె కోరుదు నిరతము తల్లీ
హిమవన్నగమే నీ దరహాసం
హిందు సంద్రమే నీ చరణ విలాసం
గంగా సింధు నీ కదలికలకు
శ్రీకారంబై పొంగిన చందం
చతురాశ్రమములు నీ జీవన సూత్రం
చతుర్వేదములు నీ పావన గాత్రం
చతుర్ధామములు నీ హృది వీధిని
వినిపించినది నీ సమతా నాదం
బ్రహ్మము క్షాత్రము నీ కౌపోసన
బడయుటె వాని నీ నిజ ఆరాధన
నాదు సాధనే సార్ధక మందగ
అభయమునిమ్మా అంజలి గొనుమా
bhaarati bhagavati naa tallI
nI bhaagyame kOrudu niratamu tallI
himavannagamE nI darahaasam
himdu samdramE nI caraNa vilaasam
gamgaa simdhu nI kadalikalaku
SrIkaarambai pomgina camdam
caturaaSramamulu nI jIvana sUtram
caturvEdamulu nI paavana gaatram
caturdhaamamulu nI hRdi vIdhini
vinipimcinadi nI samataa naadam
brahmamu kshaatramu nI koupOsana
baDayuTe vaani nI nija aaraadhana
naadu saadhanE saardhaka mamdaga
abhayamunimmaa amjali gonumaa
Post new comment