భరతుడేలిన భారత భూమి మన హిందువులకు మాతృభూమిరా
భావి తరాలకు భాగ్య విధాతగ మానవాళికి మాననీయరా
భరత భూమిరన్నా ఇదియే హిందు భూమిరన్నా
గంగా యమునా బ్రహ్మ పుత్రలు గలగల పారే పుణ్య స్రవంతులు
వింధ్య హిమాలయ పర్వత పంక్తులు భారతమాతకు కంఠ హారములు
మాతృ భూమిరన్నా మనది పితృ భూమిరన్నా
గురుగోవిందుడు ఛత్రసాలుడు శౌర్యసంపదకు జాతి రత్నములు
శంకర విద్యారణ్యవర్యులు భారతావనికి జ్ఞాన జ్యోతులు
త్యాగభూమిరన్నా మనది తపో భూమిరన్నా
మీరా తులసీ భక్త తుకారాం ఆలాపనలే అమరగీతికలు
కేశవ మాధవ భవ్య సాధనలు భారతీయులకు బంగరు బాటలు
దేవభూమిరన్నా మనది కర్మ భూమిరన్నా
bharatuDElina bhaarata bhUmi mana himduvulaku maatRbhUmiraa
bhaavi taraalaku bhaagya vidhaataga maanavaaLiki maananIyaraa
bharata bhUmirannaa idiyE himdu bhUmirannaa
gamgaa yamunaa brahma putralu galagala paarE puNya sravamtulu
vimdhya himaalaya parvata pamktulu bhaaratamaataku kamTha haaramulu
maatR bhUmirannaa manadi pitR bhUmirannaa
gurugOvimduDu ChatrasaaluDu Souryasampadaku jaati ratnamulu
Samkara vidyaaraNyavaryulu bhaarataavaniki jnaana jyOtulu
tyaagabhUmirannaa manadi tapO bhUmirannaa
mIraa tulasI bhakta tukaaraam aalaapanalE amaragItikalu
kESava maadhava bhavya saadhanalu bhaaratIyulaku bamgaru baaTalu
dEvabhUmirannaa manadi karma bhUmirannaa
Post new comment