పాడరా ఎలుగెత్తి భవ్య భారతి గీతి
చాటరా చెయ్యెత్తి జాతి వైభవ కీర్తి
చూడరా కనులెత్తి జనని సుందరమూర్తి
ఆడరా శివమెత్తి అరి భయంకర దీప్తి
బంగారు పండేటి భూమిరా మనది
రతనాలు వరలేటి రాజ్యమ్ము మనది
ప్రకృతి సౌందర్యంపు ప్రోవు ఈ నేల
నాకు లోకము కన్న మిన్నరా చాలా
కమనీయ కావ్యాలు కవులల్లినారురా
రాలు కరుగగ గానమాలపించారురా
రాతినే నాతియని భ్రమియింపజేశారు
నితి పథమున మనుజ జాతి నడిపించారు
శ్రీ రామచంద్రుడే మా ధర్మ ప్రభువనీ
శివాజీ మహరాజు స్ఫూర్తి ప్రదాతయని
ధీర కేశవవాణి దివ్య మంత్రమ్ముగా
మరల హైందవ జాతి మహిని వెల్గొందునని
paaDaraa elugetti bhavya bhaarati gIti
caaTaraa ceyyetti jaati vaibhava kIrti
cUDaraa kanuletti janani sumdaramUrti
ADaraa Sivametti ari bhayamkara dIpti
bamgaaru pamDETi bhUmiraa manadi
ratanaalu varalETi raajyammu manadi
prakRti soumdaryampu prOvu I nEla
naaku lOkamu kanna minnaraa caalaa
kamanIya kaavyaalu kavulallinaaruraa
raalu karugaga gaanamaalapimchaaruraa
raatinE naatiyani bhramiyimpajESaaru
niti pathamuna manuja jaati naDipimcaaru
SrI raamachamdruDE maa dharma prabhuvanI
SivaajI maharaaju sphUrti pradaatayani
dhIra kESavavaaNi divya mamtrammugaa
marala haimdava jaati mahini velgomdunani
Post new comment