ప్రయత్నమే స్వయత్నమై దైవమంచు సాధకా
ఇదే ధ్యాస పదే పదే మనసునందు నిలుపరా
ధ్యేయ మార్గమందునా ధ్రువుని వలె నుండుమా
సాధనా పథమ్ములో సతతమ్మూ నిలువుమా
ఆగకుండ ఆగకుండ నడువు ముందు ముందుకూ
ధ్యేయ దీప కాంతిలో సాగిపొమ్ము ముందుకూ
తోడు రాకపోయినా నీడ లేకపోయినా
దారి చుట్టు చీకటి దట్టముగా నిండినా
గట్టి గుండె బలముతో పట్టు వదిలిపెట్టకూ
ధ్యేయ దీప కాంతిలో సాగిపొమ్ము ముందుకూ
మోహ పాశములను త్రెంపి స్వార్ధమును జయింపుమా
ధ్యేయమందు ఐక్యమంది ధీరుడవై సాగుమా
వెనుకకు అడుగేయకుండ నడువు ముందు ముందుకూ
ధ్యేయ దీప కాంతిలో సాగిపొమ్ము ముందుకూ
పర్వతాలు సాగరాలు పెను తుపానులడ్డినా
ప్రళయ ఝంఝలెన్ని లేచి పైకి పైకి వచ్చినా
ఎదురు తిరిగి పైకి దూకి కదలిపొమ్ము ముందుకూ
prayatnamE svayatnamai daivamamchu saadhakaa
idE dhyaasa padE padE manasunamdu niluparaa
dhyEya maargamamdunaa dhruvuni vale numDumaa
saadhanaa pathammulO satatammU niluvumaa
aagakumDa aagakumDa naDuvu mumdu mumdukU
dhyEya dIpa kaamtilO saagipommu mumdukU
tODu raakapOyinaa nIDa lEkapOyinaa
daari chuTTu cIkaTi daTTamugaa nimDinaa
gaTTi gumDe balamutO paTTu vadilipeTTakU
dhyEya dIpa kaamtilO saagipommu mumdukU
mOha paaSamulanu trempi svaardhamunu jayimpumaa
dhyEyamamdu aikyamamdi dhIruDavai saagumaa
venukaku aDugEyakumDa naDuvu mumdu mumdukU
dhyEya dIpa kaamtilO saagipommu mumdukU
parvataalu saagaraalu penu tupaanulaDDinaa
praLaya jhamjhalenni lEchi paiki paiki vachchinaa
eduru tirigi paiki dUki kadalipommu mumdukU
dhyEya dIpa kaamtilO saagipommu mumdukU
Post new comment