పుడమితల్లికిదె వందనము మా పుణ్య భూమికిదె వందనము
హరిహరాదులకు ఆటపట్టు ఈ ధరణిమాత కిదె వందనము
హిమాలయమ్మిటు హిందు సంద్రమటు
వేదమంత్రములు వల్లెవేయగా
గంగా గోదావరి గలగలలలో
ధర్మశాస్త్రసారములుప్పొంగగ
వేదవ్యాస వాల్మీకి సప్త ఋషి
మునిగణ సేవిత మంజుభాషిణి
రామకృష్ణ చాణక్య శంకరుల
జగతికొసంగిన జగన్మోహిని
కన్నభూమి స్వేఛ్ఛా రక్షణకై
కడు ఇడుముల నెదిరించిన వీరులు
శివాజి, రాణా సావర్కరులకు
కర్మక్షేత్రమై నిలిచిన తల్లి
puDamitallikide vamdanamu maa puNya bhUmikide vamdanamu
hariharaadulaku ATapaTTu I dharaNimaata kide vamdanamu
himaalayammiTu himdu samdramaTu
vEdamamtramulu vallevEyagaa
gamgaa gOdaavari galagalalalO
dharmaSaastrasaaramuluppomgaga
vEdavyaasa vaalmIki sapta Rshi
munigaNa sEvita mamjubhaashiNi
raamakRshNa chaaNakya Samkarula
jagatikosamgina jaganmOhini
kannabhUmi svEChChaa rakshaNakai
kaDu iDumula nedirimcina vIrulu
Sivaaji, raaNaa saavarkarulaku
karmakshEtramai nilicina talli
Post new comment