రాముడేలిన రాజ్యమిదిరా రత్న రాసుల నిలయమిదిరా
ధర్మ ధేనువు పాదమూనిన కర్మభూమిర సోదరా
దేశ భక్తియు రాజ భక్తియు తేజరిల్లగ చాంద భట్టుడు
ప్రభుని గూడెను రిపుని జంపెను కార్య శూరుడు సోదరా
అడవులందున ఇడుములంబడి కుడువ కూడే లేక యుండియు
విడువలేదు ప్రతాప సింహుడు పౌరుషమ్మును సోదరా
శీలమునకై ప్రణమొడ్డెను మానవతులకు మర్గమయ్యెను
దేశ చరితకు వన్నె తెచ్చెను రాణి పద్మిని సోదరా
నాతి యొక్కతె నీతిమతియై కదన భూమిని కదను త్రొక్కుచు
తెల్లవారల గుండె చీల్చెను తల్లి ఝాన్సీ సోదరా
గుహను దాగిన కొదమ సింగపు మదమణంచగ మహిత హృదయుడు
విశ్శ్వ మత సభ నా వివేకుడు గెలిచె వాదము సోదరా
హైందవేయుల హృదయ సీమల సంఘ జ్యోతిని వెలుగజేసిన
పూజ్య కేశవ మార్గమిదిగో అనుసరింపర సోదరా
raamuDElina raajyamidiraa ratna raasula nilayamidiraa
dharma dhEnuvu paadamUnina karmabhUmira sOdaraa
dESa bhaktiyu raaja bhaktiyu tEjarillaga caamda bhaTTuDu
prabhuni gUDenu ripuni jampenu kaarya SUruDu sOdaraa
aDavulamduna iDumulambaDi kuDuva kUDE lEka yumDiyu
viDuvalEdu prataapa simhuDu pourushammunu sOdaraa
SIlamunakai praNamoDDenu maanavatulaku margamayyenu
dESa caritaku vanne teccenu raaNi padmini sOdaraa
naati yokkate nItimatiyai kadana bhUmini kadanu trokkucu
tellavaarala gumDe cIlcenu talli JaansI sOdaraa
guhanu daagina kodama simgapu madamaNamcaga mahita hRdayuDu
viSSva mata sabha naa vivEkuDu gelice vaadamu sOdaraa
haimdavEyula hRdaya sImala samgha jyOtini velugajEsina
pUjya kESava maargamidigO anusarimpara sOdaraa
Post new comment