శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలు బారిన భాగ్య సీమయి
వరలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా
వేద శాఖలు వెలసెనిచ్చట ఆదికావ్యములలరెనిచ్చట
బాదరాయణ పరమఋషులకుప్ పాదుసుమ్మిది తమ్ముడా
విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్మధువొలికెనిచ్చట
విపులతత్త్వము విస్తరించిన విమల తలమిదె తమ్ముడా
సూత్ర యుగముల శుధ్ధ వాసన క్షాత్రయుగముల శౌర్య చండిమ
చిత్రదాస్యముచే చరిత్రల చెఱిగి పోయెర తమ్ముడా
మేలి కిన్నెర మేళవించీ రాలు కరుగగ రాగమెత్తీ
పాలతీయని భారతీయత పదము పాడర తమ్ముడా
దేశ గర్వము దీప్తి చెందగ దేశ చరితము తేజరిల్లగ
దేశమరసిన ధీరపురుషుల తెలిసి పాడర తమ్ముడా
పాండవేయుల పదును కత్తులు మండి మెరిసిన మహిత రణ కథ
కండగల చిక్కని పదంబుల కలిపి పాడర తమ్ముడా
SrIlu pomgina jIvagaDDayi paalu baarina bhaagya sImayi
varalinadi I bharata KamDamu bhakti paaDara tammuDaa
vEda Saakhalu velaseniccaTa aadikaavyamulalareniccaTa
baadaraayaNa paramaRShulakup paadusummidi tammuDaa
vipina bamdhura vRkshavaaTika upanishanmadhuvolikeniccaTa
vipulatattvamu vistarimcina vimala talamide tammuDaa
sUtra yugamula Sudhdha vaasana kshaatrayugamula Sourya camDima
citradaasyamucE caritrala ce~rigi pOyera tammuDaa
mEli kinnera mELavimcI raalu karugaga raagamettI
paalatIyani bhaaratIyata padamu paaDara tammuDaa
dESa garvamu dIpti cemdaga dESa caritamu tEjarillaga
dESamarasina dhIrapurushula telisi paaDara tammuDaa
paamDavEyula padunu kattulu mamDi merisina mahita raNa katha
kamDagala cikkani padambula kalipi paaDara tammuDaa
Post new comment