ఆట కలసి ఆడుదాం పాట కలసి పాడుదాం
ఆటపాటలాడుచునే అడుగు ముందుకేయుదాం ముందు ముందు కేగుదాం
అడుగు చిన్నదే దానికి అమిత శక్తి ఉందిరా
విత్తు చిన్నదే దానికి సత్తువెంతొ ఉందిరా
శాఖ చిన్నదే శాఖా కార్యక్రమం చిన్నదే
శాఖ లోనె సంఘటనా శక్తి ఇమిడి ఉందిరా
చుక్క చుక్క నీటి బొట్టు ఒక్క నదిగ మారురా
పెక్కొలనులు ఒకటైతే పెద్ద సంద్రమగునురా
వ్యక్తి ఒక్కడే వ్యక్తుల శక్తి కూడ తక్కువే
వ్యక్తి వ్యక్తి కలియ మహా సంఘ శక్తి అగునురా
ప్రకృతి మాత ఒడిని రంగు రంగు పూలు ఉన్నవి
క్రమము తప్పి విచ్చలవిడి విడి వడి పడి యున్నవి
ఏర్చి కూర్చుదాం కూర్చి మాలగాను మార్చుదాం
మార్చి భరతమాత పాద అర్చనలను చేయుదాం
Andaram kalisi vundam
Jai Hind
aravind | Oct 8 2014 - 12:23
Post new comment