The song in its original script, with the Roman reading beside it.
జన జాగృత నవభారత మహోదయంఈ కనులతోనే కాంచుదాంఈ జీవితమున సాధించుదాం ||జన
ప్రతి హృది లో దేశ భక్తి మోసులెత్తనర నరాన నవచేతన వెల్లివిరియసమతాభావన పెంచి ప్రతి హృదిలో మమత నింపిజాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం ||జన
మన పూర్వుల మహనీయుల స్మరియించిమన సంస్కృతి మహోన్నతిని గుర్తెరిగిఅహరహము శ్రమియించి జగతిన శిరమెత్తి నిలచిజాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం ||జన
ప్రాంత భాష కులమతాల కలతలతోపలురీతుల బలహీనత లావరించెఅందరమొకటిగ నిలచి తరతమ భేదాలు మరచిజాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం ||జన
నలుదిక్కుల ప్రమాదాలు పెచ్చుపెరిగిఅదనుచూచి కాటువేయ చూస్తున్నవిజనతను జాగృతపరిచి ఎదఎదలో శక్తి నింపిజాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం ||జన
Spotted a mistake in these lyrics? Suggest a correction